India Corona: దేశంలో కొత్త‌గా 2.09 ల‌క్ష‌ల కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుతూ వ‌స్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 13 ల‌క్ష‌ల మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 2,09,918 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య‌శాఖ సోమ‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.
తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 4,13,02చ‌440 కి చేరాయి.

గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 959 మంది క‌రోనా బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు. కేవ‌లం ఒక్క కేర‌ళ రాష్ట్రంలోనే కొత్త‌గా 51 వేల కేసులు, 475 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.

ఇప్పటి వ‌ర‌కు దేశంలో మొత్తం 3,89,76,122 మంది క‌రోనా నంచి కోలుకున్నారు. క్రియాశీల కేసుల రేటు 4.43 శాతానికి త‌గ్గింది.. రిక‌రి రేటు 94.37 శాతానికి చేరింది. అలాగే ఆదివారం ఒక్క రోజు 28 ల‌క్ష‌ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.