India Corona: కొత్త‌గా 2.82 ల‌క్ష‌ల కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా కేసులు విజృంభిస్తున్నాయి. కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. నిన్న మొన్న కాస్త త‌గ్గిన‌ట్లే క‌నిపించానా ఇవాల (బుధ‌వారం) ఒక్క‌సారిగా కేసులు సంఖ్య భారీగా న‌మోదైంది. అలాగే మ‌ర‌ణాల్లో కూడా పెరుద‌ల న‌మోదైంది.

గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 18 ల‌క్ష‌ల మంది క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోగా … 2,82,970 మందికి వైర‌స్ పాజిటివ్‌గా తేలింది. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 3కోట్ల 79 ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన ప‌డ్డారు.

గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో క‌రోనాతో 441 మంది మృత్యువాత ప‌డ్డారు.
ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 4,87,202 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య మంత్రి శాఖ బుధ‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 1,88,157 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 18,31,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మ‌రోప‌క్క ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. తాజాగా 8,961 మందికి పాజిటివ్‌గా తేలింది.

Leave A Reply

Your email address will not be published.