రన్‌వేపై అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన భారీ విమానం..
CLiC2NEWS: ఓ భారీ నిఘా విమానం రన్‌వేపై అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన హవాయి దీవుల్లోని మెరైన్ కోర్ బేస్‌లో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకంది. సముద్రంలో బోటింగ్ చేస్తున్న వాళ్లు విమానం నీటిపై తేలడం చూసి అవాక్కయ్యారు. అక్కడే ఉన్న కోస్టు గార్డు సిబ్బంది స్పందించడంతో.. విమాన సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నిఘా విమానం అమెరికా నౌకాదళానికి చెందింది. అమెరికా నౌకాదళంలో పి-8ఎ పొసెడాన్ విమానం.. సబ్మెరైన్లను గాలించి వాటిపై దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. భారీగా ఇంటెలిజెన్స్‌ను కూడా ఈ విమానం సేకరించగలదు. టోర్పెడోలు, క్రూజ్ క్షిపణులను కూడా తీసుకెళ్లగలదని సమాచారం.
ప్రపంచంలో పి-8 విమానాలను బ్రిటిన్, నార్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్ సైన్యాలు కూడా వాడుతున్నాయి. 2009లో కూడా అమెరికాలో ఓ భారీ విమానం హడ్సన్ నది మధ్యలో నీటిపై లాండ్ అయింది. అపుడు ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులను సురక్షితంగా కాపాడాడు.