ఉగ్రవాదం ఏరూపంలో ఉన్న రూపుమాపాల్సిందే..
Operatin Sindoor: పాకిస్థాన్ దుశ్చర్యలు , ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లేందుకు భారత్ నుండి పలు బృందాలు విదేశాలకు వెళ్లాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ దుశ్చర్యలను ఆయా దేశాల నాయకులకు వివరించేందుకు అక్కడి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ప్రముఖులు, మేధావులతో భేటీ అవుతున్నాయ. దీనిలో భాగంగా శివసేన పెంపి శ్రీకాంత్ శిండే నేతృత్వంలో అఖిలపక్ష బృందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లింది. రెండు కీలక సమావేశాల్లో పాల్గొన్న ఈ బృందం.. పాక్ నుండి ఎదురవుతున్న ఉగ్రముప్పు, ఆపరేషన్ సిందూర్ వంటి చర్యలను వారికి వివరించింది. ఈ క్రమంలో భారత్ చేపట్టిన దౌత్యపరమైన కార్యక్రమానికి యుఎఇ అధికారులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా రూపుమాపాల్సిందేనని ఉద్ఘాటించారు.