కలకాలం గుర్తుండిపోయే యుగమిది..
కలియుగం అంటే కలికాలం కాదేమో..
కలకాలం గుర్తుండిపోయే యుగమిది..
త్రేతాయుగపు రామయ్య కు తిరిగి
పట్టాభిషేకం చేసి ప్రణమిల్లే భాగ్యమిది..
యుగ పురుషుడు రామయ్యకై
యోగపురుషుడు నరేంద్రుడు చేపట్టిన యాగమిది..
అయోధ్యా పురమున పునాది రాయి పడిన అపూర్వమైన సమయమిది..
రామజన్మభూమి రామమందిరాన్ని
వీక్షించటానికి కోట్ల కనులతో ఎదురు చూస్తున్న
యావత్ భారత సంతతి గర్వించదగ్గ సంకల్ప బలమిది..
చరిత్ర పుటలకు మన ఉనికిని తెలియజేసిన ప్రభంజనమిది..
రాబోయే తరాలను వీనుల విందుగా
అలరించటానికి వస్తున్న రామాయణ చరితమిది..
-కవితాశరణ్
[…] కలకాలం గుర్తుండిపోయే యుగమిది.. […]