ఝార్ఖండ్ సిఎంతో కెసిఆర్ భేటీ..
రాంచీ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఝార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. కెసిఆర్‌కు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి నుండి ఘన స్వాగతం లభించింది. తాజా రాజకీయ పరిస్థితులపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం. సిఎం కెసిఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షలు వినోద్ కుమార్, మంత్ఇర శ్రీనివాస్‌గౌడ్, ఎంపి సంతోష్ కుమార్, ఎమ్యెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
సమావేశానికి ముందు ముఖ్యమంత్రి కెసిఆర్ రాంచీలోని గిరిజన ఉద్యమకారుడు బిర్సా ముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన గిరిజన జాతికి, ఈదేశానికి అందించాన సేవలను సిఎం కొనియాడారు.