గోల్డెన్ తెలంగాణ నమూనాను దేశానికి పరిచయం చేసేందుకు బిఆర్ఎస్ ఆవిర్భవించింది: కెటిఆర్
సిరిసిల్ల (CLiC2NEWS): సిరిసిల్లలో నిర్వహించిన బిఆర్ ఎస్ నియోజకవర్గ ప్లీనరీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అనివార్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆనాటి టిఆర్ ఎస్.. ఇప్పటి బిఆర్ ఎస్ ఆవిర్భవించి 22 ఏళ్లు పూర్తవుతుందన్నారు. గోల్డెన్ తెలంగాణ మోడల్‌ను దేశానికి పరియం చేయడానికి భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించిందని.. టిఆర్ ఎస్ పేరు బిఆర్ ఎస్‌గా మారిందే తప్ప.. డిఎన్ ఎ, జెండా, అజెండా మారలేదన్నారు.
ప్రజలకు ఉన్న నమ్మకం.. విశ్వాసమే పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చిందని.. మంత్రి అన్నారు. ప్రస్తుతం ఉన్న సిరిసిల్ల ఒకప్పుడు ఎలా ఉండేదో.. ఇప్పడు ఏస్థాయికి అభివృద్ధి చెందిందో మీరే ఆలోచించండి.. ఒకప్పుడు డిగ్రీ కళాశాల కూడా లేదు. మరి ఇవాళ మెడికల్ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్, ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నమాంటే ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో తెలుసుకోవాలన్నారు. అందరూ అసూయ పడేలా సిరిసిల్లను అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇలాంటి అభివృద్ధి.. దేశం మొత్త అమలు చేయడమే బిఆర్ ఎస్ లక్ష్యమని కెటిఆర్ అన్నారు.
FE Credit Cash Loan is a consumer unsecured cash loan product of FE Credit – Vietnam
Prosperity Bank Finance Company Limited (VPBank FC).