గణేశుడి విగ్రహం తరలిస్తుండగా ప్రమాదం: ముగ్గురు మృతి
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో గణేశుడి విగ్రహం మండపానికి తీసుకెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పాతబస్తీలో చోటుచేసుకుంది. వినాయక చవితి సమీస్తుండటంతో పలు ప్రాంతాల్లో గణేష్ విగ్రహాలను మండపాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పాతబస్తీ బండ్లగూడలో విగ్రహం తరలిస్తుండగా.. విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు అంబర్‌పేట్‌లో రామ్ చరణ్ అనే యువకుడు కూడా కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. వీరు విగ్రహం తరలిస్తుండగా.. అడ్డువచ్చిన కరెంట్ తీగలను కర్రలతో పైకి లేపుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు.
కృష్ణాష్టమి వేడుకల్లో సైతం ఐదుగురు వ్యక్తులు కరెంట్ షాక్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలో ఈ ఘటన చోటు చేసుకోవడం విషాదకరం. ఈ నేపథ్యంలో విగ్రహాలను తరలించేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి.. విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు మృతి
[…] […]