వివాద‌స్ప‌ద స్థ‌లంలో నిర్మాణాలు చేప‌ట్ట‌వ‌ద్దు: హైకోర్టు

హైద‌రాబాద్ (CLiC2NEWS): జూబ్లిహిల్స్‌లోని హౌసింగ్ సొసైటిలోని వివాద‌స్ప‌ద స్థ‌లంలో నిర్మాణాలు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని సినీ న‌టుడు చిరంజీవిని ఆదేశిస్తూ.. హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆ స్థ‌లంలో య‌థాస్థితి కొన‌సాగించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌జా అవ‌స‌రాల కోసం వినియోగించేందుకు కేటాయించిన 595 గ‌జాల స్థలాన్ని చిరంజీవికి సొసైటి విక్ర‌యించింద‌ని జె. శ్రీ‌కాంత్‌బాబు, త‌దిత‌రులు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. జిహెచ్ ఎంసి స్వాధీనం చేసుకోక‌పోవ‌డంతో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా విక్ర‌యించార‌ని, అందులో చిరంజీవి నిర్మాణం చేప‌ట్టార‌ని పేర్కొన్నారు. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటి, జిహెచ్ ఎంసిని ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ ఏప్రిల్ 25కి వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.