పెన్సిళ్లపై మహాభారతం..

కారంచేడు (CLiC2NEWS): ఎపిలోని ప్రకాశం జిల్లా, కారంచేడు మండలం, స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత 810 పెన్సిళ్లపై మహాభారతం లిఖించింది. మహాభారతంలోని 18 పర్వాలు, 700 శ్లోకాలను సంస్కృత భాషలో లిఖించినది. దీనికోసం ఆమె 810 పెన్సిళ్లను వనియోగించింది. వాటిపై 67,230 అక్షరాలు, 7,238 పదాలు రాసింది. పెన్సిళ్ల లిడ్ కేవలనం 2 మిల్లీ మీటర్ల మందం మాత్రమే ఉంది. మహిత మొదటగా బియ్యపు గింజలపై జాతీయ జెండా, తాళం, బాణం, వినాయకుడు వంటి ఆకృతులను చెక్కేది. ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో తన పేరు నమోదు చేసుకోవడమే తన లక్ష్యమని చెబుతున్నారు.