TS: ‘మన ఊరు మన బడి’ విధివిధానాలు ఖరారు

హైదరాబాద్ (CLiC2NEWS): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూపొందించిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం విధి విధానాలను తెలంగాణ సర్కార్ ఖరారు చేసింది. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.7,289.54 కోట్లతో దశల వారీగా పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులను, డిజిటల్ విద్య వంటివి ప్రభుత్వం చేపట్టనుంది.
మూడు సంవత్సరాలలో అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో కార్యక్రమం చేసట్టనుంది. తొలి దశలో 9,123 పాఠశాలల్లో రూ. 3,497.62 కోట్లతో పనులు చేపట్టేందుకు కార్యచరణ ప్రాంభించనుంది.ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలల్లో తొలి దశ పనులు చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలకు పూర్వ విద్యార్థుల సంఘం, పాఠశాల విద్యా కమిటీల ద్వారా అభివృద్ధి పనులను నిర్వహిస్తుంది. విరాళాలు, సిఎస్ ఆర్ నిధుల కోసం ప్రత్యేక ఖాతా తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.