ఢిల్లీలోని ఎపి భవన్‌లో తెలుగు విద్యార్థులను కలిసిన ఎంపి సత్యవతి

ఢిల్లీ (CLiC2NEWS):ఉక్రెయిన్‌నుండి ఢిల్లీకి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను కేంద్ర విదేశ వ్యవహారాల శాఖ కమిటీ సభ్యురాలు బి.వి.సత్యవతి కలిశారు. విద్యార్థులను క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. గురువారం ప్రత్యేక విమానాలలో 86 మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. వీరిన ఎపి భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో భవన్ ఉద్యోగులు భోజన, వసతి, రవాణా సదుపాయాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.