ప్రొఫెస‌ర్ ప్ర‌స‌న్న‌శ్రీ‌కి నారీశ‌క్తి పుర‌స్కారం

అమ‌రావ‌తి (CLiC2NEWS):  ఆంధ్ర యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ స‌త్తుపాటి ప్ర‌స‌న్న‌శ్రీకి నారీశ‌క్తి-2021 పుర‌స్కారం ల‌భించింది. రాష్ట్రప‌తిభ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌స‌న్న‌శ్రీ రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పుర‌స్కారాన్ని అందుకున్నారు. 2020,2021 సంవ‌త్స‌రాల‌కు క‌లిపి మొత్తం 28 మంది రాష్ట్రప‌తి పుర‌స్కారాలు అందుకోగా.. తెలుగు రాష్ట్రాల‌కు నుండి ప్ర‌స‌న్న‌శ్రీ ఒక్క‌రే ఉన్నారు. ఆంధ్రాయూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్‌, బోర్డ్ ఆఫ్ స్ట‌డీస్ ఛైర్‌ప‌ర్స‌న్‌గా ప‌నిచేస్తున్న ప్ర‌స‌న్నశ్రీ అల్ప‌సంఖ్యాక గిరిజ‌న భాష‌ల సంర‌క్ష‌ణ‌కు కృషిచేస్తూ వాటికి లికిత రూపాల‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఆమె భ‌గ‌త‌, గ‌డ‌భా, కోల‌మి, కొండ‌, దొర‌లాంటి 19 గిరిజ‌న భాష‌ల‌కు అక్ష‌రాలు, సంఖ్య‌ల‌ను రూపొందించిన మొద‌టి మ‌హిల‌గా గుర్తింపు పొందారు. మ‌హిళ‌ల‌పై ప‌లు ర‌చ‌న‌లు చేశారు. వ‌రల్డ్ అట్లాస్ ఆఫ్ ఎండేజ‌ర్డ్ ఆల్ఫాబెట్స్‌, యుఎస్ ఎ 2019 గుర్తింపు పొందిన తొలి భార‌తీయ‌, ఆసియా మ‌హిళ‌గా పేరుపొందారు.

Leave A Reply

Your email address will not be published.