తండ్రి నేర చర్యలకు కుమార్తెను శిక్షించరాదు: ఢిల్లీ హైకోర్టు
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/DELHI-HIGH-COURT.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): జాతీయ స్థాయి షూటర్ దిశా లంగన్ లైసెన్స్‌ను ఉపయోగించుకొని ఆమె తండ్రి నేరచర్యలకు పాల్పడ్డాడు. ఆమె లా చదువుతూ షూటింగ్ ప్రాక్టీస్‌లో బిజీగా ఉండేది. కూతురు పోటీల్లో పాల్గొనేందుకు ఆయుధాలు, తూటాలు దిగుమతి చేసుకోవాడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. అక్రమంగా తుపాకులను దిగుమతి చేసుకున్నాడు. ఆయుధాలను అక్రమంగా అమ్ముకుంటున్నాడని దిశాపై కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపి.. పిటిషనర్ ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ మహిళ. ఆమె న్యాయశాస్త్రం చదువుతూ.. షూటింగ్‌లో దేశానికి గౌరవం తేవాలన్న ఆమె తపనను న్యాయస్థానం పరిగణలోకి తీసుకంఉది. తండ్రి చర్యలకు ఆమెను శిక్షించకూడదని నిర్ధారించింది.