అవ‌స‌ర‌మైతే క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు సిద్ద‌మ‌న్న మాహారాష్ట్ర సిఎం

ముంబ‌యి (CLiC2NEWS): ఛ‌త్ర‌ప‌తి శివాజి మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల ఆరాధ్య దైవం. వంద‌సార్లు ఆయ‌న పాదాలు తాకేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని.. అవ‌స‌ర‌మైతే క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు వెనుకాడ‌న‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ శిండే పేర్కొన్నారు. మ‌హారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్‌లో 35 అడుగుల శివాజి విగ్ర‌హం ఇటీవ‌ల కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌తో రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వ‌టంతో సిఎం స్పందించారు. రాజ‌కీయాలే చేయాల‌నుకుంటే విప‌క్ష‌ల‌కు అనేక అంశాలు ఉన్నాయని , శివాజి మ‌హారాజ్‌ను దీనికి దూరంగా ఉంచాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. విగ్ర‌హాన్ని పున‌ర్న‌ర్మించడ‌మే త‌మ ప్ర‌య‌త్న‌మ‌న్నారు.

రాజ్‌కోట్‌లోని శివాజి విగ్ర‌హం గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌ర్‌లో ఏర్పాటు చేశారు. నేవి డే సంద‌ర్బంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విగ్ర‌హావిష్క‌ర‌ణ చేశారు. ఆ విగ్ర‌హం కూలిపోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.విగ్ర‌హ నిర్మాణంలో కుంభ‌కోణం జరిగింద‌ని విప‌క్షాలు ఆరోపించాయి.

Leave A Reply

Your email address will not be published.