Bengaluru: రేవణ్ణ దోషే..
బెంగళూరు కోర్టులోనే కన్నీటి పర్యంతమైన మాజీ ఎంపీ
బెంగళూరు (CLiC2NEWS): మాజీ ప్రధాని, జెడిఎస్ అధినేత దేవెగౌడ మనవడు, మాజీ ఎంపి రేవణ్ణ కేసులో కోర్టు తీర్పును వెల్లడించింది. అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవణ్ణను కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఇది విన్న రేవణ్ణ న్యాయస్థానంలోనే కన్నీటి పర్యంతమయ్యారు.
గత యేడాది తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా గత సంవత్సరం ఈ కేసు బెంగళూరు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. గత యేడాది (2024) డిసెంబరు 31న విచారణ మొదలెట్టిన ఈ కోర్టు దాదాపు 123 ఆధారాలను, ఫోరెన్సిక్ ఆధారాలను కూడా పరిగణనలోకి తీసుకుంది.