బాలిక‌పై సామూహిక అత్యాచారం.. ముగ్గ‌రు ప్ర‌భుత్వ టీచ‌ర్లు అరెస్టు

మ‌హేంద్ర‌గ‌ఢ్‌ (CLiC2NEWS): విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కీచ‌కులై బాలిక‌పై అత్య‌చారానికి ఒడిగ‌ట్టారు. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని మ‌హేంద్ర‌గ‌ఢ్ లో చోటుచేసుకుంది. మ‌హేంద్ర‌గ‌ఢ్‌-చిర్‌మిరి-భ‌ర‌త్‌పుర్ జిల్లా జ‌న‌క్‌పూర్ పోలీస్ స్టేష‌న్ పరిధిలో 17 ఏళ్ల బాలిక‌పై ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ముగ్గురు ఉపాధ్యాయులు స‌హా మ‌రో వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. దేవ్‌గ‌ఢ్‌లోని ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌కు చెందిన ఇద్ద‌రు ఉపాధ్యాయులు అశోక్ కుమార్ కుష్వాహా, కుశాల్ సింగ్, ప్ర‌భుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడు ర‌వేంద్ర సింగ్ కుష్వాహా ,అట‌వీ శాఖ ఉద్యోగి బ‌న్వ‌రి సింగ్ ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థినికి చదువులో స‌హాయం చేస్తామ‌ని న‌మ్మించి .. ఆమెపై అత్యాచారానికి ఒడిగ‌ట్టిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఈ న‌లుగిరిపై ప‌లు సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. ముగ్గురు ఉపాధ్యాయుల్ని ఉన్న‌తాధికారులు స‌స్పెండ్ చేసిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.