Delhi: వీధి కుక్కలను తరలిస్తున్నారనే సిఎంపై దాడి!
ఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీ సిఎం రేఖాగుప్తాపై బుధావారం దాడి జరిగింది. అయితే, ఢిల్లీలోని వీధి కుక్కలను షెల్లర్లకు తరలిస్తున్నారనే కోపంతో ముఖ్యమంత్రిపై దాడి చేశానని నిందితుడు తెలిపినట్లు సమాచారం. ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన ఆదేశాల మేరకు వీధి కుక్కలను షెల్టర్లకు తరలిస్తున్నట్లు సిఎం మీడియాకు తెలిపారు. దీంతో జంతు ప్రేమికుడైన నిందితుడు .. సిఎం తీసుకున్న నిర్ణయంపై ఎంతగానో బాధపడ్డట్లు తెలిపాడు. ఈ విషయంపై సిఎంతో మాట్లాడేందుకు ఢిల్లీకి వచ్చినట్లు తెలిపాడు. కుక్కలను షెల్టర్లకు తరలించే చర్యను నిలిపివేయాలని అభ్యర్థించడానికి వచ్చానని, అది కుదరకపోవడంతో ‘జన్ సున్వాయ్’ కార్యక్రమానికి వెళ్లినట్లు నిందితుడు తెలిపాడు. సమస్యను సిఎం కు వివరించగా.. ఆమె పట్టించుకోలేదని, అందుకే కేపంతో దాడి చేసినట్లు తెలిపాడు. అయితే, నిందితుడి వాదనను మంత్రి కపిల్ మిశ్రా కొట్టిపారేశారు.
సిఎం రేఖాగుప్తా నివాసం వద్ద నిందితుడు తచ్చాడిని వీడియోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో సిఎం రేఖా గుప్తాకు ‘జడ్’ కేటగిరి భద్రత ను కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు గురువారం అధికారక వర్గాలు వెల్లడించాయి. సిఆర్‌పిఎఫ్‌కు చెందిన 20-25 మంది సిబ్బంది సిఎంకు రక్షణ కల్పించే విధులు నిర్వహిస్తారు.
Also Read: ఢిల్లీ సిఎంపై దాడి!
AP, Telangana: జలాశయాలు నిండుకుండలు
[…] Delhi: వీధి కుక్కలను తరలిస్తున్నార… […]