ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం..
ముంబయి (CLiC2NEWS): ముంబయి ఎయిర్‌పోర్టు (Airport)లో లాండ్ అవ్వాల్సిన ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ఇండిగో ఎయిర్‌బస్ ఎ321 విమానం ముంబయి విమానాశ్రయంలో ల్యాండ్ చేసే ప్రయత్నంలో విమానం తోక భాగం రన్‌వేను తాకింది. కానీ, మళ్లీ గాల్లోకి వెళ్లిన విమానం .. రెండో సారి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ముంబయి విమానాశ్రయంలో విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నది. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండ్ చేసే పరిస్థితి లేకపోవడంతో విమానం మళ్లీ గాల్లోకి పైలట్.. గాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విమాన తోక భాగం రన్‌వేకు తాకింది. అనంతరం సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు ఇండిగో అధికారులు వెల్లడించారు.
Also Read: ACA కమిటి అధ్యుక్షుడిగా కేశినేని శివనాథ్
[…] ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. […]
[…] ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. […]