నీ చితిలో తోడై నేనొస్తా.. ప్రియురాలి చితిలోకి దూక‌డానికి య‌త్నించిన ప్రియుడు

నాగ్‌పుర్ (CLiC2NEWS): ప్రియురాలి మృతితో మ‌న‌స్తాపానికి గురైన ప్రియుడు ఆమె చితిలోకి దూక‌బోయిన ఘ‌ట‌న నాగ్‌పుర్ లో చోటుచేసుకుంది. మ‌హారాష్ట్రలోని నాగ్‌పుర్ కామ‌లి లో ప్రియురాలి మర‌ణంతో క‌ల‌త చెందిన ఓ యువ‌కుడు ఆమె అంత్య‌క్రియ‌లు జ‌రుగుతుండ‌గా చితిలోకి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. వాళ్లిద్దరి మ‌ధ్య చిన్న గొడ‌వ కార‌ణంగా యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు స‌మాచారం. దీంతో యువ‌కుడు మ‌న‌స్తాపానికి గురై మ‌ద్యం తాగి ఆమె చితిలో దూకేందేకు య‌త్నించాడు. మృతురాలి బంధువులు అత‌నిని అడ్డుకున్నారు. యువ‌కుడు అప‌స్మార‌ఖ స్థితిలోకి వెళ్ల‌గా.. స‌మీప ఆస్ప‌త్రిలో చికిత్స‌నందించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.