నీట్‌లో సత్తాచాటిన తెలుగు విద్యార్థులు..

అమరావతి (CLiC2NEWS): ఇటీవల నిర్వహించిన నీట్ యూజి పరీక్షల్లో శ్రీకాకుళం విద్యార్థి వరుణ్ చక్రవర్తి దేశంలోనే మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటాడు. తమిళనాడుకు చెందిన ప్రభంజన్‌తో కలిసి చక్రవర్తి ఈ ర్యాంకును పంచుకున్నాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఈ పరీక్షల్లో మొదటి 50 ర్యాంకుల్లో చోటు దక్కించుకున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వరుణ్ చక్రవర్తి (1), యల్లంపల్లి లక్ష్మీ ప్రవర్ధన్ రెడ్డి (25), వంగీపురం హర్హిల్ సాయి (38), కణి యశశ్రీ (40), కల్వకుంట్ల ప్రణతి రెడ్డి (45)ఉన్నారు. తెలంగాణకు చెందిన కాంచాని గేయంత్ రఘురాంరెడ్డి (15), జాగృతి బోడెద్దుల (49) విద్యార్థులు ఉన్నారు.
దేశవ్యాప్తంగా మే 7వ తేదీన నీట్ యూజి పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 20,38,596 మంది హాజరయ్యారు. వీరిలో 11,45,976 మంది అర్హత సాధించారు.