పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోరం

నెల్లూరు (CLiC2NEWS): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. ఓ మహిళ వరకట్న దాహానికి బలైంది. కట్టుకున్న భర్త, అత్తమామలు, ఆడపడుచు కలిసి మహిళను కట్నం కోసం కొన్నాళ్లుగా వేధిస్తున్నారు. బాధితురాలు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని వారిని హెచ్చరించింది. ఫిర్యాదు చేస్తానన్నందుకు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు.రంగునీళ్లు తాగించి ఊపిరాడకుండా చేశారు. అనంతరం వివస్త్రను చేసి దారుణంగా హతమార్చారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నెల్లూరు డిఎస్‌పి విచారణ చేపట్టారు.