Padma Awards: బిపిన్ రావత్ కు పద్మవిభూషణ్..
న్యూఢిల్లీ (CLiC2NEWS): రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాల్లో సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల జాబితాను మంగళవారం రాత్రి కేంద్రం విడుదల చేసింది. 2021 కి గానూ నలుగురికి పద్మవిభూషణ్, 17 మంది పద్మవిభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది.
పద్మవిభూషణ్..
పద్మవిభూషణ్‌కు మొత్తం నలుగురి పేర్లను ఎంపిక చేశారు. వీరిలో ముగ్గురికి మరణాంతరం ఈ గౌరవం అభించింది. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల్లో దివంగత మాజీ సిడిఎస్ బిపిన్ రావత్ (మరణాంతరం), యుపి మాజీ సిఎం కళ్యాణ్ సింగ్ (మరణాంతరం), రాధేశ్యామ్ ఖేమ్కా (మరణాంతరం), ప్రభా ఆత్రే ఉన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనభీ ఆజాద్‌కు పద్మవిభూషన్, బెంగాల్ మాజీ సిఎం బుద్ధదేవ్ భట్టాచారికి పద్మభూషన్,
తెలుగు పద్మాలు..
తెలుగు వారికి మొత్తంగా ఏడు పద్మ పురస్కారాలు వరించాయి.
తెలంగాణకు నాలుగు, ఎపికి మూడు అవార్డులు దక్కాయి.
తెలంగాణ నుంచి పద్మజారెడ్డి, దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్యలను పద్మశ్రీలు దక్కాయి. అలాగే భారత్ బయోటెక్ సిఎండి కృష్ణ ఎల్ల, జెఎండి సుచిత్ర ఎల్ల దంపతులు (సంయుక్తంగా) పద్మభూషణ్ పురస్కారం.
ఎపి నుంచి.. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్ హాసన్ పద్మశ్రీ అవార్డులు లభించాయి.
padma awards 2021