AP: నలుగురు వైఎస్ఆర్‌సిపి ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్లు వైఎస్ ఆర్‌సిపి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎమ్ ఎల్‌సి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న కారణంతో ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను అధికార పార్టీ సస్పెండ్ చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆనురాధ 23 ఓట్లు సాధించారు.