రేపు హైద‌రాబాద్‌కు ప్ర‌ధాన‌మంత్రి రాక‌..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి శ‌నివారం హైద‌రాబాద్‌కు రానున్నారు. ముచ్చింతల్ లోని స‌మ‌తామూర్తి స‌హ‌స్రాబ్ధి ఉత్స‌వాల‌తో పాటు ప‌టాన్‌చెరు వ‌ద్ద ఇక్రిశాట్ స్వ‌ర్ణోత్స‌వాల్లో పాల్గొంటారు. ప్ర‌ధాన‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో సుమారు ఎనిమిది వేల మంది పోలీసుల‌తో బందోబ‌స్తు ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి శ‌నివారం మ‌ధ్యాహం శంషాబాద్ విమానాశ్ర‌యం నుండి ప‌టాన్‌చెరులోని ఇక్రిశాట్ స్వ‌ర్ణోత్స‌వ వేడుక‌ల‌కు హాజ‌ర‌వుతారు. అక్క‌డ మొక్క‌ల ర‌క్ష‌ణ కోసం వాతావ‌ర‌ణ మార్పు ప‌రిశోధ‌నా కేంద్రాన్ని, ర్యాపిడ్ జ‌న‌రేష‌న్ అడ్వాన్స్‌మెంట్ సౌక‌ర్యాన్ని మోడి ప్రారంభిస్తారు. అనంత‌రం స్వ‌ర్ణోత్స‌వాల లోగోను, ప్ర‌త్యేక పోస్ట‌ల్ స్టాంపును విడుద‌ల చేయ‌నున్నారు. సాయంత్రం 5 గంట‌ల‌నుండి ముచ్చింతల్ లోని స‌మ‌తామూర్తి వేడుక‌ల‌కు హాజ‌ర‌వుతారు. రామానుజాచార్యుల విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారు.

Leave A Reply

Your email address will not be published.