భారీగా పెరిగిన బంగారం ధ‌ర

 

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడికి దిగిన నేప‌థ్యంలో బంగారం ధ‌ర భారీగా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధ‌ర దేశంలో రూ. 54,000 దాటింది. ఈ ఒక్క‌రోజులో బంగారం ధ‌ర రూ. 3,000 పెరిగిపోయింది. అదే బాట‌లో వెండి ధ‌ర‌ల‌కు కూడా రెక్క‌లోచ్చాయి. నిన్ప‌టి వ‌ర‌కు కిలో వెండి ధ‌ర రూ.65,000 ఉండ‌గా , ఉక్రెయ‌న్‌పై ర‌ష్యా దాడి నేప‌థ్యంలో కిలో వెండి రూ. 5,000 మేర పెరిగి రూ. 70,000 గా ఉంది.ర‌ష్యా ఉక్రెయిన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు ప్ర‌పంచ‌మార్కెట్‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. దాంతో ట్రేడింగ్ బంగారానికి అనుకూలంగా ఉంద‌ని ఐసిఐసిఐ డెరెక్ట్ నివేదిక‌లో పేర్కొంది. ఫిబ్ర‌వ‌రి నెల‌లో బంగారం ధ‌ర‌లు ఇప్ప‌టి వ‌ర‌కు 8% పెరిగాయి. మ‌రోప‌క్క‌ స్టాక్ మ‌ర్కెట్లు యుద్ధ‌భీతితో కొట్టుమిట్టాడుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.