ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్‌గా ఆర్‌బిఐ గవర్నర్
ముంబయి (CLiC2NEWS): వరుసగా రెండో సారి ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్‌గా ఆర్‌బిఐ గవర్నర్ ఎంపికయ్యారు. ఆమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకుల్లో ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ కు అగ్రస్థానం దక్కింది. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో ప్రపంచంలో ముగ్గురు కేంద్ర బ్యాంక్ గవర్నర్‌లకు ఏ+ రేటింగ్ ఇచ్చింది. వీరిలో శక్తికాంతదాస్ అగ్రస్థానం పొందారు. ఈ మేరకు ఆర్‌బిఐ ఎక్స్‌లో వెల్లడించింది. ద్రవ్యోల్చణం, ఆర్ధికాభివృద్ధి లక్ష్యాలు, ఆర్ధిక స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణ ఆధారంగా కేంద్రబ్యాంకుల గవర్నర్లకు ఏ నుండి ఎఫ్ వరకు గ్రేడ్‌లను కేటాయించారు. శక్తికాంతదాస్‌తో పాటు ఏ+ రేటింగ్ పొందిన వారిలో డెన్మార్క్‌కు చెందిన క్రిస్టియన్ కెటెల్ ధామ్‌సన్, స్విట్జర్లాండ్ గవర్నర్ ధామస్ జే జోర్డాన్ ఉన్నారు.