Hyderabad: రేవంత్‌రెడ్డి అరెస్టు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఎర్రవెల్లిలో రచ్చబండకు రేవంత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపత్యంలో సోమవారం ఉదయం జూబ్లీహిల్స్లోని రేవంత్ ఇంటి వద్ద పోలీసులు మోహరించి గృహనిర్భంధం చేశారు. ఈక్రమంలో ఎర్రవెల్లి వెళ్లేందుకు ఆయన ఇంటి నుంచి బయటకు రాగానే పోలీసులు అడ్డకున్నారు. రేవంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున రేవంత్ ఇంటికి చేరుకున్న కార్యకర్తలకు పోలీసులు మధ్య తోపులాట జరిగింది. నిరసన ల మధ్యనే రేవంత్‌న పోలీసులు బలవంతంగా వాహనం ఎక్కించి తరలించారు.