పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): దేశంలో బంగారం ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి. బుధ‌వారం ప‌ది గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర‌ రూ. 652 పెరిగింది.  24 క్యారెట్ బంగారం ధ‌ర రూ. 50,518 నుండి రూ. 51,170కు చేరింది. ఆదేదారిలో వెండి కూడా రూ. 1,715 పెరిగి రూ. 66,130 గా ఉంది. ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే బంగారం ధర‌లు మరింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణ‌ల అభిప్రాయం. అంత‌ర్జాతీయ ప‌రిణామాలే ధ‌ర‌ల పెదుగుద‌ల‌కు కార‌ణ‌మ‌ని అంటున్నారు. ఉక్రెయిన్ -ర‌ష్యా ఉద్రిక్త‌తలు, అమెరికా బాండ్ల‌పై రాబ‌డి తగ్గడం వ‌ల‌న బంగారంపై పెట్టుబ‌డులు పెట్టేంరుకు మ‌దుప‌ర్లు ఆస‌క్తి చూపుతున్నారిని విశ్లేష‌కులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.