కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
జగ్గయ్యపేట (CLiC2NEWS): కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కల్వర్టును ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులలో చిన్నారి ఆరు నెలల కూడా ఉంది.జగ్గయ్యపేట సమీపంలోని గౌరవరం గ్రామం వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై కారు కల్వర్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు మహిళలు, ఓవ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలైన ఆరు నెలల చిన్నారి, మరొక మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరణించిన వారు హైదరాబాద్‌లోని చందానగర్ హుడా కాలనీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పాప అన్నప్రాసన నిమిత్తం వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ప్రమాదం జరింగిందని సమాచారం.