కొరియర్ ద్వారా రూ. 7 కోట్ల మాదకద్రవ్యాలు!
బెంగళూరు (CLiC2NEWS): కర్ణాటకలోని కెంపేగౌడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు కొరియర్‌లో రూ. 7 కోట్ల హెరాయిన్, రూ. 2.82 కోట్ల విలువైన ఎమ్.డి.ఎమ్.ఎ. మాత్రలు వచ్చాయి. కస్టమ్స్ అధికారులు ఈ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. కొరియర్‌పై ఉన్న చిరునామా ఆధారంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్లు ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపారు. ఈ కొరియర్ బెల్జియం, జాంబియాల నుండి దుబాయ్ మీదుగా వచ్చాయని వెల్లడించారు. విమానాశ్రయానికి ఇంత భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు రావడం ఇదే మొదటిసారని అధికారులు అన్నారు.