ముచ్చింతల్‌లో మొదలైన ఆధ్యాత్మిక సందడి..
రామానుజాచార్యుల సహాస్రాబ్ది సమారోహ కార్యాక్రమాలు ప్రారంభం

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్‌లోని సమాతామూర్తి రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి (బుధవారం) నుండి ఫిబ్రవరి 14 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.
ఈ శోభాయాత్రలో త్రిదండి చిన్నజీయర్ స్వామితో పాటు పలువురు స్వామీజీలు, వేలాది మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ఈయాత్ర జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుండి యాగశాల వరకు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు సహస్రాబ్ధి ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. దీనిలో అత్యంత కీలకమైన హోమాలు ప్రారంభమవుతాయి. అనంతరం అరణి మథనం, అగ్ని ప్రతిష్ఠ జరుగుతాయి. వెయ్యి 36 కుండాలతో కూడిన లక్ష్మీ నారాయణ మహాయాగంతో వేడుకలను ప్రారంభిస్తున్నారు.
ఈ నెల 5న ప్రధాని మోడీ, 7న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, 8న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో 7 వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు.