విండీస్ వికెట్ కీపర్ జోషువా తల్లి విరాట్‌కు వీరాభిమాని
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/mother-of-theselva.jpg)
ట్రినిడాడ్ (CLiC2NEWS): క్రికెట్ ప్రియులకు భారత స్టార్ క్రికెటర్ కోహ్లీ అంటే ఎంతో పిచ్చో చెప్పనక్కర్లేదు. ఈ అభిమానం భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉందనడంలో అతిశయోక్తిలేదు. తాజా ఓ మహిళ అభిమాని కోహ్లీ ఆట చూసి.. అతనిని కలుసుకొని ఆలింగనం చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భారత్, విండీస్ రెండో టెస్టు జరుగుతున్న విషయంత తెలిసిందే. వెస్టిండీస్ వికెట్ కీపర్ జోషువా ద సిల్లా తల్లి మన విరాట్ కోహ్లీకి వీరాభిమాని. అతని ఆట చూడడానికే స్టేడియానికి వస్తుందని జోషువా చెప్పడం.. స్టంప్ మైక్‌లో రికార్డయినట్లు సమాచారం. కోహ్లీ కోసం స్టేడియంకు వచ్ఇచ మ్మాచ్ చూస్తానని మా అమ్మ చెప్పింది అని తొలి రోజు ఆట సందర్భంగా జోషువా పేర్కొన్నాడు. అయితే రెండో రోజు ఆటలో విరాట్ సెంచరీని దసిల్వా తల్లి దగ్గరుండి వీక్షించారు. ఆట ముగిసిన తర్వాత విరాట్ బస్సు ఎక్కుతుండగా ఆమె విరాట్‌ను ఆలింగనం చేసుకొని..ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో ఇన్నింగ్స్ తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సెంచరీని సాధించాడు. అతనితో పాటు జడేజా 61, అశ్విన్ అర్ధ సెంచరీలతో రాణించారు.