IND vs SRI: తొలి వన్డేలో భారత్ గెలుపు..
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/SRI-LANKA-VS-BHARATH.jpg)
గువాహటి (CLiC2NEWS): భారత్, శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కెప్టెన్ డాసున్ శనక 108 పరుగులు, ఓపెనర్ నిశాంక 72, ధనంజయ డి సిల్వా 47 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీశాడు. సిరాజ్ రెండు.. హార్దిక్ పాండ్య, షమి, బాహల్ తలో వికెట్ పడగొట్టారు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 113 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 83, శుభ్‌మన్ గిల్ 70, శ్రేయస్ అయ్యర్ 28, కెఎల్ రాహుల్ 39, హార్దిక్ పాండ్య 14, అక్షర్ పటేల్ 9, సిరాజ్ 7, షమి 4 పరుగులు చేశారు.
శతకం బాది.. సచిన్ రికార్డును అధిగమించిన కోహ్లీ