ప్రపంచ ర్యాపిడ్ మహిళల చెస్ ఛాంపియన్‌షిప్‌లో హంపికి రజతం..

Chess champion: 2019లో ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన కోనేరు హంపి మహిళల ఛాంపియన్‌షిప్‌లో రజతాన్ని సొంతం చేసుకుంది. హంపి ప్రత్యర్థియైన కేథెరీనా (రష్యా)పై విజయం సాధించి 8.5 పాయింట్ల స్కోర చేసింది. మరోవైపు ఆనస్తాసియా బొద్నారుక్ (రష్యా) కూడా 8.5 పాయింట్ల స్కోర్‌తో నిలిచింది. వీరిద్దరు మధ్య విజేత ఎవరో నిర్వయించేందుకు ట్రైబ్రేక్ నిర్వహించారు.
ఆనస్తాసియా బొద్నారుక్ (రష్యా) తో ట్రైబ్రేక్ నిర్వహించగా.. తొలి గేమ్‌లో హంపి గెలిచింది. రెండో గేమ్‌లో అనస్తాసియా విజయం సాధించింది. మూడో గేమ్ డ్రగా ముగిసింది. దీంతో నాలుగో గేమ్ ఆడాల్సివచ్చింది. దీంట్లో అనస్తాసియా విజయం సాధించడంతో హంపి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మిగిలిన తెలుగు అమ్మాయిలు సాహితి వర్షిణి (7.5) 13, ప్రియాంక నూతక్కి (7) 22వ, ద్రోణవల్లి హారిక (6) 48వ స్థానాల్లో నిలిచారు.