ఎస్ఎస్‌సి నిర్వహించే ఎంటిఎస్ ఎక్జామ్.. ఇక నుండి ప్రాంతీయ భాషలో..
ఢిల్లీ (CLiC2NEWS): స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పరీక్షను ఇక నుండి 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లోని గ్రూప్-బి, నాన్ గెజిటెడ్, గ్రూప్-సి నాన్-టెక్నికల్ విభాగాల్లో ఉన్న ఖాళీలను ఎస్ఎస్ సి ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పటివరకు కేవలం హిందీ, ఇంగ్లీష్‌లోనే నిర్వహించే ఈ పరీక్షలు.. ఇప్పటినుండి 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. హిందీ, ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, ఉర్దూ, తమిళం, మలయాళం, కన్నడ, అస్పామి, బెంగాలి, గుజరాతి, పంజాబి, కొంకణి, మణిపూరి, మరాఠీ, ఒడియా భాషల్లోనూ పోటీ పరీక్షను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
ప్రధాని మోడీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది, వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుండి వస్తున్న విజ్ఞప్తుల మేరకు.. ఉద్యోగాల నియామకంలో భాష అవరోధంగా కాకూడదని, ఎవ్వరూ కూడా అవకాశం కోల్పోకూడదనేదే తమ ఉద్దేశ్యమని వివరించారు.