వికారాబాద్ జిల్లాలో వింత శకటం.. ఆసక్తిగా తిలకిస్తున్న స్థానికులు

వికారాబాద్ (CLiC2NEWS): జిల్లాలోని మొగిలిగుండ్లలో గుండ్రటి ఓ వింత శకటం కనిపించింది. అది ఏమిటోనని.. ఎక్కడినుండి వచ్చిందోనని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆ శకటం గుండ్రంగా, బెలూన్ ఆకారంలో కనిపిస్తుంది. దీని గురించి పోలీసులకు అధికారులు సమాచారం అందించారు. అది రీసెర్చ్ హీలియం బెలూన్ అని అధికారులు తెలిపారు. వాతావరణంలో చోటుచేసుకునే మార్పులను అధ్యయనం చేయటానికి శాస్త్రవేత్తలు వీటిని పంపుతారని తెలియజేశారు. ఈ బెలూన్ని బెలూన్ ఫెసిలిటి ఆఫ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో పంపినట్లు అధికారులు వివరించారు.