శాసనసభలో 2022-23 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి
తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ. 2,56,98.51 కోట్లు
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హరీశ్‌రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనతికాలంలోనే దేశంఓ కెల్లా అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చింది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని మంత్రి గన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
బడ్జెట్ ముఖ్యాంశాలు:
తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ. 2,56,98.51 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 1.89 లక్షల కోట్లు
క్యాపిటల్ వ్యయం రూ. 29,728 కోట్లు
దళిత బంధకు రూ. 17,700 కోట్లు
పల్లె ప్రగతి ప్రణాళికకు రూ. 330 కోట్లు
పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ. 1,394కోట్లు
కొత్త వైద్య కళాశాలలకు రూ. వెయ్యి కోట్లు
అటవీ విశ్వవిద్యాలయానికి రూ. 100 కోట్లు
రైతులకు శుభవార్త
రూ. 50వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ
పంట రుణాలు రూ. 16,144 కోట్లు మాఫీ
వచ్చే ఆర్ధిక ఏడాది రూ. 75వలే లోపు సాగు రుణాలు మాఫీ
రాష్ట్రంలో పన్ను ఆదాయం రే. 1,08,211.93 కోట్లు
కేంద్ర పన్నుల్లో వాటా 11,394.11 కోట్లు
పన్నేతర ఆదాయం 25,421.63 కోట్లు
గ్రాంట్లు రూ 41,001.73 కోట్లు
రుణాలు రూ. 53,970 కోట్లు
అమ్మకం పన్న అంచనారూ. 33,000 కోట్లు
ఎక్సైజ్ ద్వారా ఆదాయం రూ. 17,500 కోట్లు
స్టాంపులు, రిజిస్ట్రేషన్లు ద్వారా ఆదాయం రూ. 15,500 కోట్లు
సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ. 3లక్షల ఆర్ధిక సాయం.
వ్యవసాయ రంగానికి 24,254 కోట్లు
పామాయిల్ సాగుకు వెయ్యి కోట్లు
ఆసరా పింఛన్లు రూ. 11,728 కోట్లు
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.2,750
బ్రహ్మాణ సంక్షేమానికి రూ. 177 కోట్లు
రోడ్ల, భవనాలకు రూ,. 1,542 కోట్లు
పోలీసు శాఖకు రూ. 9,315 కోట్లు
గిరిజన గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి రూ. 600 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి రూ. 12,565 కోట్లు
బిసి సంక్షేమానికిరూ.5,698 కోట్లు