ప్రజలకు ఇచ్చిన హామీలు నెవేరేలా బడ్జెట్: మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ (CLiC2NEWS): నేడు తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఉభయసభలలో రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టనున్నారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేలా బడ్జెట్ ఉంటుందని, రైతులు, సామాన్యాలకు పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 2022-23 వార్షిక బడ్జెట్ లో కెసిఆర్ మార్క్ కనిపిస్తుందన్నారు. బంజారాహిల్స్ లోని వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుండి శాసనసభకు చేరుకొని, స్పీకర్, మండలి ప్రొటెం ఛైర్మన్ ను కలిసి బడ్జెట్ పత్రాలు అందించారు. మరికాసేపట్లో ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.