బిసి, సాంఘిక, గిరజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశ పరీక్ష
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో మొదటి సంత్సరంలో చేరాలనుకొనే విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బిసి సంక్షేమ, ఎస్‌సి, ఎస్‌టి బాలుర/ బాలికల సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షను ఏప్రిల్ 28వ తేదీన ఇంగ్లీష్, తెలుగు భాషల్లో నిర్వహిస్తారు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 12వ తేదీ వరకు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బిఎస్‌సి, బికాం, బిఎ, బిబిఎ, బిఎస్‌సి-ఫ్యాషన్ టెక్నాలజి, బిఎస్‌సి (ఆనర్స్) డిజైన్, టెక్నాలజి, బిఎస్‌సి లైఫ్ సైన్సెస్, బికాం కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు రుసంఉ రూ. 200గా ఉంది. విద్యార్థులు 2023-24 లో ఇంటర్ పరీక్షల్లో 50 % మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్‌లో 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది.