వైద్యారోగ్య శాఖ‌లో 1,331 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ: హ‌రీశ్‌రావు

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ‌లో మొత్తం 1,331 మంది కాంట్రాక్టు ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తూ స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. నూత‌న స‌చివాలయం ప్రారంభోత్సవం అనంత‌రం ముఖ్య‌మంత్రి కెసిఆర్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ ద‌స్త్రంపై సంత‌కం చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయా విభాగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తూ ఆయా శాఖ‌లు ప్ర‌త్యేకంగా ఉత్త‌ర్వులు జారీ చేస్తున్నాయి. ఉన్న‌త విద్యాశాఖ‌లో ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీకరిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. తాజాగా వైద్యారోగ్య శాఖ‌లో జారీ అయిన ఉత్త‌ర్వుల‌ను ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌కు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు అంద‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.