బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లండి.. సుప్రీంకోర్టు
ఢిల్లీ (CLiC2NEWS): మద్యం కేసులో బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో తన అరెస్టు చట్టవిరుద్దమంటూ కవిత సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. ఈ కేసులో తాము బెయిల్ ఇవ్వలేమని, మొదట కింది కోర్టును ఆశ్రయిచాలని తెలిపింది.
ఈ కేసులో కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టులో వాదనలు వినిపించారు. ఇడి వ్యవహరించిన తీరు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తమను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసులో ఒకసారి సాక్షిగా, మరోసారి నిందితురాలిగా పిలిచారని తెలిపారు. కవితకు వ్యతిరేకంగా ఒక్క బలమైన సాక్ష్యం కూడా లేదని, అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు సాగుతోందన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. అంతేకాక త్వరితగతిన కేసు విచారణ చేపట్టాలని ట్రయల్‌కోర్టుకు సూచించింది.