భ‌ద్రాచ‌లం ఆల‌య ఇఒపై గ్రామ‌స్థుల దాడి..

Villagers attack Bhadrachalam temple EO..

భ‌ద్రాచలం (CLiC2NEWS): భ‌ద్రాచ‌లం ఆల‌య భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను అడ్డుకునే క్ర‌మంలో ఆల‌య ఇఒపై దాడి జ‌రిగింది. పురుషోత్త‌ప‌ట్నంలో భ‌ద్రాద్రి రామాల‌యానికి సంబంధించి 889.5 ఎక‌రాల భూమి ఉంది. భూముల‌ను దేవ‌స్థానానికి అప్ప‌గించాల‌ని ఇప్ప‌టికే హైకోర్టు ఉత్తుర్వులు జారీ చేసింది. భూములను ఆక్ర‌మించిన గ్రామ‌స్థులు కోర్టు ఉత్త‌ర్వులను ఖాత‌రు చేయ‌క నిర్మాణాలు చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో భూ ఆక్ర‌మ‌ణ‌ను అడ్డుకునేందుకు వెళ్లిన ఆల‌య ఇఒ ర‌మాదేవిపై దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో ఆమె స్పృహ కోల్పోగా.. ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ నేప‌థ్యంలో ఆల‌య సిబ్బంది, గ్రామ‌స్థుల‌కు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం నెల‌కొంది.

 

Leave A Reply

Your email address will not be published.