సతీసమేతంగా వింబుల్డన్ మ్యాచ్ వీక్షించిన విరాట్ కోహ్లీ..
లండన్ (CLiC2NEWS): క్రికెట్ కంటే.. వింబుల్డన్ లోనే ఒత్తిడి ఎక్కువుంటుందని విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డారు. సోమవారం లండన్‌లోని సెంటర్ కోర్టులో జకోవిచ్, అలెక్స్ డి మినార్ మధ్య వింబుల్డన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను విరాట్ తన సతీమణితో కలిసి వీక్షించారు. అనంతరం ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా , పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు ఉన్నపుడు ఎంత తీవ్రమైన ఒత్తిడి ఉంటుందో, ప్రతి వింబుల్డన్ మ్యాచ్‌లోనూ అంతే స్తాయిలో ఉంటుందన్నారు. ప్రేక్షకులతో కిక్కిరిసిన క్రికెట్ మైదానంలో ఆడటం కేంటే.. సెంట్రల్ కోర్టులో వింబుల్డన్ ఆడటమే కాస్త కష్టమని విరాట్ అన్నారు. క్రికెట్ ఆడేటపుడు అభిమానులు దూరంగా ఉంటారు.. కానీ వింబుల్డన్ ఆడేటపుడు జనాలు చాలా దగ్గరగా ఉంటారు. ఇది ఆటగాళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. వరల్డ్ కప్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో మాత్రమే కాళ్లు వణికేంత ఒత్తిడి ఉంటుంది. కానీ టెన్నిస్ ఆటగాల్లు క్వార్టర్ ఫైనల్ నుండి ఫైనల్ మ్యాచ్ వరకు ఒకే రకమైన ఒత్తిడిని ఎదుర్కుంటారని కోహ్లీ తెలిపారు.
ఇటీవల ఐపిఎల్ సీజన్ 18లో బెంగళూరు ఛాలెంజర్స్ తొలి టైలిల్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. అనంతరం బెంగళూరులో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దర్ఘటన అనంతరం విరాట్ ఇపుడే బయట కనిపించడం.