`ఎమ్మెల్సీ`కి రాజీనామా చేస్తా: క‌విత

హైద‌రాబాద్ (CLiC2NEWS): భార‌త రాష్ట్ర స‌మితి పార్టి నుండి ఎమ్మెల్సీ క‌వితను స‌స్పెండ్ చేస్తూ పార్టి అధినేత కెసిఆర్ నిర్ణ‌యం తీసుకున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ జాగృతి కార్యాల‌యంలో క‌విత మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. బిఆర్ ఎస్ పార్టి ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి , ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు క‌విత ప్ర‌క‌టించారు. త‌న‌పై ప‌నిగట్టుకొని కొంద‌రు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, కేవ‌లం డబ్బు సంపాదించుకునే ఆలోచ‌న‌తో కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. నేను , నాన్న‌, అన్న క‌లిసి ఉండ‌టం చాలా మందికి ఇష్టం లేద‌ని, దీనిలో భాగంగా ముందుగా త‌న‌ను బ‌య‌ట‌కు పంపించార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇది ఇక్క‌డితో ఆగ‌దు నాన్నా.. మీచుట్టూ ఏం జ‌రుగుతుందో చూడ‌మ‌ని, బిఆర్ ఎస్ ను హ‌స్త‌గ‌తం చేసుకునే కుట్ర‌లో భాగంగా త‌న‌ను ముందుగా బ‌య‌ట‌కు పంపించార‌ని ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

బిఆర్ ఎస్ పార్టికి నష్టం క‌లిగించే రీతిలో క‌విత వ్య‌వ‌హ‌రిస్తున్నారని, ఇటీవ‌ల కాలంలో ఆమె ప్ర‌వ‌ర్తిస్తున్న తీరుతెన్నులు, కొన‌సాగిస్తున్న పార్టి వ్య‌తిరేక కార్య‌క‌లాపాలను అధిష్టానం తీవ్రంగా ప‌రిగ‌ణించింది. దీంతో క‌విత‌ను పార్టీ నుండి స‌స్పెండ్ చేస్తూ అధ్య‌క్షుడు కెసిఆర్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని, పార్టి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల సంత‌కాల‌తో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

2 Comments
  1. […] `ఎమ్మెల్సీ`కి రాజీనామా చేస్తా: క‌విత […]

Leave A Reply

Your email address will not be published.