పరువు హత్య కేసులో నల్గొండ కోర్టు తీర్పు..

నల్గొండ (CLiC2NEWS): పరువు హత్య కేసులో నల్గొండ ఎస్‌సి, ఎస్టి కోర్టు నిందితులకు కఠిన శిక్షలు విధించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య (2018) కేసులో ఇటీవల కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఎ2గా ఉన్న నిందితుడు సభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించగా.. మిగిలిన నిందితులకు జీవితఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది.
ఈ కేసులో ఎ1 నిందితుడు మారుతీరావు 2020లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎ2 సుభాష్‌కుమార్ శర్మ, ఎ3 అస్టర్ అలీ, ఎ4 బారి, ఎ5 కరీం, ఎ6 శ్రవణ్ కుమార్, ఎ7 శివ, ఎ8 నిజాంలు నిందితులుగా ఉన్నారు.
మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతిరావు తన కుమార్తె అమృత ప్రణయ్‌ను 2018 జనవరిలో కులాంతర వివాహం చేసుకుంది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య విభేదీలు తలెత్తాయి. పోలీసులకు సైతం ఫిర్యాదులు అందాయి. అనంతరం ప్రణయ్‌తోనే ఉంటానని పోలీసుల సమక్షంలో అమృత తేల్చి చెప్పింది. దీంతో మారుతీ రావు 2018 సెప్టెంబర్ 14 సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఎనమిది మందిని నిందితులుగా పేర్కొంటూ 2019 ఛార్జిషీటు దాఖలు చేశారు. ఐదేళ్లకు పైగా కోర్టులో విచారణలు కొనసాగాయి. ఇటీవల వాదనలు ముగియడంతో తాజాగా కోర్టు తుది తీర్పును వెలువరించింది.