ఇంటర్ పరీక్షలు ముగించుకొని ఇంటికి రాగా.. విగతజీవులుగా తల్లిదండ్రులు

నిజామాబాద్ (CLiC2NEWS):ఇంటర్ పరీక్షలు పూర్తిచేసుకొని కుమారుడు ఇంటికొచ్చేసరికి తల్లిదండ్రులు ఉరివేసుకొని మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన స్వామి, దేవలక్ష్మి దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. డిచ్పల్లి మండలంలోని మోడల్ స్కూల్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఇంటర్ పరీక్షలు ముగియడంతో బుధవారం ఇంటికి తిరిగివచ్చాడు. అతను ఇంటికొచ్చేసరికి తల్లిదండ్రులు విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసి గుండెలవిసేలా రోదించాడు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది.
ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న స్వామి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని బంధువులు తెలిపారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని, మానసిక సమస్యలతోనే చనిపోతున్నట్లు ఆత్మహత్యకు ముందు ఫోన్లో స్వామి ఆడియో రికార్డు చేశాడు.