Ramavaram: ఆయన బతకంతా తెలంగాణకే..
రామవరం (CLiC2NEWS): తెలంగాణ స్వరాష్ట్ర కలల జెండాను.. భవిష్యత్ అజెండాను వదలలేదు. తెలంగాణే శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా.. తెలంగాణ లక్ష్యంగా బతికారు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సంకు బాపన అనుదీప్ అన్నారు. బుధవారం ఆచార్య జయశంకర్ సార్ 91వ జయంతి కార్యక్రమాన్ని సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ ఉద్యమ స్ఫూర్తి ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఉద్యమకారుడి నుంచి మహోపాధ్యాయుడి దాకా.. ఎన్ని ఆటు పోట్లు ఎదురొచ్చినా.. ఎన్నెన్నో కుట్రల కత్తులు దూసినా..వెన్ను చూపలేదన్నారు. వెనకడుగు వేయలేదు. ఒంటరైనా తన గళం విప్పారు. ఎలుగెత్తిన నినాదం ఆపకుండా కోట్లాది సకల జనుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ స్వరాష్ట్ర సాధనలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ నాయకులు గూడెల్లి యాకయ్య, బావు సతీష్, మొహమ్మద్ మునవర్, గూడెల్లి ముఖేష్, మాచర్ల ప్రదీప్, మంద జయరాజు,ఎన్. డి. రవితేజ, పవన్, సిపిఐ పార్టీ రుద్రంపూర్ పార్టీ సెక్రెటరీ తోటరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ ఉమర్, నిమ్మల సాగర్, మొహమ్మద్ అజీజ్ ఖాన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

[…] Ramavaram: ఆయన బతకంతా తెలంగాణకే.. […]