Murudeshwar: రెండో అతిపెద్ద శివుడి విగ్ర‌హం

కర్ణాటక రాష్ట్రంలోని మురుడేశ్వర్ శివుని విగ్ర‌హం

మురుడేశ్వర్ (CLiC2NEWS): కర్ణాటక రాష్ట్రంలోని మురుడేశ్వర్ లో గల శివుని విగ్రహం అతి ఎత్తైనది. ఈ శివుని విగ్రహం ప్రపంచంలోనే రెండవ అతి ఎత్తైన విగ్రహం.  అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ ఆల‌య‌ గోపురం భారత దేశంలోనే అతిపెద్ద రెండవ గోపురం.

 

ఈ విగ్ర‌హం ఎత్తు 123 అడుగులు. ఇది అరేబియా సముద్రం ఒడ్డున గ‌ల కొండ‌పై ఉంది. దీనిని 2006లో నిర్మించారు.  సూర్య‌ర‌శ్మి విగ్ర‌హం ముఖంపై ప‌డే విధంగా నిర్మించ‌డం ఈ విగ్ర‌హం ప్ర‌త్యేక‌త‌..

కాగా ఇక్కడి అరేబియా సముద్రంలోని బీచ్ చూడడానికి కనువింపుగా  ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. గోపురం పైనుంచి చూస్తే చాలా విశాలమైన సముద్రంతో పాటు, శివుని విగ్ర‌హం ఆకట్టుకునే విధంగా ఉంటుంది…

హైద‌రాబాద్ నుంచి  మురుడేశ్వర్  వెళ్లాలంటే…

రోడ్డు మార్గం: 

హైద‌రాబాద్ నుంచి సుమారు 675 కి.మీ

ప్రయాణ సమయం: సుమారు 12-14 గంటలు

బెస్ట్ రూట్: Hyderabad → Raichur → Bagalkot → Hubli → Sirsi → Murudeshwar

స్వంత కార్ లేదా టాక్సీ ద్వారా లేదా కర్ణాటక RTC/ప్రైవేట్ బస్సులు ద్వారా ప్రయాణించవచ్చు.

 

రైలు మార్గం:

హైదరాబాద్ నుంచి Kundapura / Bhatkal వరకు ట్రైన్ లో వెళ్లి అక్క డి నుంచి  మురుడేశ్వర్‌కు బస్సు లేదా టాక్సీ (సుమారు 30-40 కిమీ)లో వెళ్లాలి.

లేదా..

హైదరాబాద్  నుంచి మంగళూరు ట్రైన్ లో వెళ్లి అక్క‌డ ఇనుంచి  Murudeshwar కి లోకల్ ట్రైన్ లేదా బస్సు/కారులో వెళ్లవచ్చు (సుమారు 150 కిమీ)

విమానం: 

హైదరాబాద్  టు మంగళూరు కు  రెగ్యులర్ విమాన స‌ర్వీసులు ఉన్నాయి.

అక్కడ నుంచి రోడ్డు మార్గంలో  మురుడేశ్వర్‌కు సుమారు 150 కి.మీ (3-4 గంటలు)

 

-కొడకల గోవర్ధన్ ముదిరాజ్ 

సీనియర్ జర్నలిస్ట్

సెల్‌: +91 90599 99259

 

 

 

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: Ramavaram: ఆయన బతకంతా తెలంగాణకే..

2 Comments
  1. […] Murudeshwar: రెండో అతిపెద్ద శివుడి విగ్ర‌హం […]

  2. […] చ‌ద‌వండి:  Murudeshwar: రెండో అతిపెద్ద శివుడి […]

Leave A Reply

Your email address will not be published.