సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన సిఎం కెసిఆర్

సంగారెడ్డి (CLiC2NEWS): సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కెసిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ పరిధిలో మొత్తం 3.34 లక్షల ఎకరాలకు నీరు అందనున్నది. ప్రభుత్వ ఈ ప్రాజెక్టు కోసం రూ. 4,427 కోట్లు ఖర్చు చేయనున్నది. ఈ పథకం ద్వారా సంగారెడ్డి, జహీరాబాద్, అంధోల్ నియోజకవర్గాల్లో ఉన్న 12 మండల్లోని 231 గ్రామాలకు నారాయఖేడ్, అందోల్‌నియోజకవర్గాల్లో ని ఎనిమిది మండలాల పరిధిలో ఉన్న 166 గ్రామాలకు నీరందుతుంది. రానున్న రెండు సంవత్సరాలలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిఎం వెల్లడించారు.